జస్టిస్‌ రజనీ సేవలు ఆదర్శనీయం

ABN , First Publish Date - 2020-11-06T09:02:53+05:30 IST

న్యాయవ్యవస్థ ద్వారా సమాజానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.రజనీ అందించిన సేవలు అందరికీ ఆదర్శప్రాయమని ప్రధాన న్యాయమూర్తి

జస్టిస్‌ రజనీ సేవలు ఆదర్శనీయం

వీడ్కోలు సభలో ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరి


అమరావతి, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): న్యాయవ్యవస్థ ద్వారా సమాజానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.రజనీ అందించిన సేవలు అందరికీ ఆదర్శప్రాయమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి ప్రశంసించారు. గురువారం జస్టిస్‌ రజనీ పదవీవిరమణ సందర్భంగా హైకోర్టు ప్రాంగణంలో  వీడ్కోలు సభ నిర్వహించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు జస్టిస్‌ రజనీని సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు. జస్టిస్‌ జేకే మహేశ్వరి మాట్లాడుతూ జస్టిస్‌ రజనీ ఎంతో సాహోసోపేతంగా న్యాయవ్యవస్థలో పని చేశారని, ఎన్నో ముఖ్యమైన కేసుల్ని సత్వరం విచారించి పరిష్కరించారన్నారు. అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం, హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యదర్శి ప్రసాద్‌, బార్‌కౌన్సిల్‌ చైర్మన్‌ గంటా రామారావు, అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎన్‌.హరినాథ్‌ ఆమె సేవల్ని కొనియాడారు. కాగా, న్యాయవ్యవస్థ పటిష్ఠతకు ప్రతి ఒక్కరూ అంతఃకరణశుద్ధితో పని చేయాలని జస్టిస్‌ రజనీ పిలుపునిచ్చారు.

Updated Date - 2020-11-06T09:02:53+05:30 IST