ఆదర్శనీయులు జస్టిస్ కోకా సుబ్బారావు
ABN , First Publish Date - 2020-02-20T10:09:14+05:30 IST
దివంగత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు ఆదర్శనీయమైన న్యాయమూర్తి అని, న్యాయవ్యవస్థకు ఆయన చేసిన సేవలు...
- బాంబే హైకోర్టు జస్టిస్ శేషాద్రినాయుడు ప్రశంస
అమరావతి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): దివంగత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు ఆదర్శనీయమైన న్యాయమూర్తి అని, న్యాయవ్యవస్థకు ఆయన చేసిన సేవలు నిరుపమానమని బాంబే హైకోర్టు గోవా బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ దామా శేషాద్రినాయుడు శ్లాఘించారు. బుధవారం హైకోర్టు ప్రాంగణంలో అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జస్టిస్ శేషాద్రినాయుడు ‘ప్రెసిడెంట్స్: కాన్సెప్ట్స్ అండ్ కన్ఫ్యూజన్స్’ అనే అంశంపై ఉపన్యసించారు.
ఏపీ హైకోర్టు నూతన భవనానికి రావడం, పాతమిత్రులను, సహచరులను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నిర్వాహకులు జస్టిస్ శేషాద్రినాయుడును సత్కరించారు. అసోసియేషన్ అధ్యక్షుడు వైవీ రవిప్రసాద్, అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరాం, ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ కృష్ణమోహన్, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారు.