బీసీ సంఘం ముసుగులో జస్టిస్‌ ఈశ్వరయ్య తప్పుడు ఆరోపణలు

ABN , First Publish Date - 2020-08-01T09:59:15+05:30 IST

పదవీ విరమణ అనంతరం ఉన్నత విద్య రెగ్యులేటరీ కమిటీ చైర్మన్‌గా తనకు పదవి కట్టబెట్టిన

బీసీ సంఘం ముసుగులో జస్టిస్‌ ఈశ్వరయ్య తప్పుడు ఆరోపణలు

  • హైకోర్టు ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఇలా..
  • హైకోర్టుకు రిజిస్ట్రార్‌ జనరల్‌ నివేదన

అమరావతి, జూలై 31(ఆంధ్రజ్యోతి): పదవీ విరమణ అనంతరం ఉన్నత విద్య రెగ్యులేటరీ కమిటీ చైర్మన్‌గా తనకు పదవి కట్టబెట్టిన రాష్ట్ర ప్రభుత్వాన్ని సంతృప్తిపరిచేందుకు జస్టిస్‌ ఈశ్వరయ్య బీసీ సంఘం ముసుగులో హైకోర్టు ప్రతిష్ఠను దెబ్బ తీస్తున్నారంటూ రిజిస్ట్రార్‌ జనరల్‌ బీఎస్‌ భానుమతి ప్రాథమిక కౌంటర్‌ దా ఖలు చేశారు. హైకోర్టు వెలువరిస్తున్న తీర్పులను స్వీకరించడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడంలేదన్నారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో కరోనాను ని యంత్రించడంలో విఫలమయ్యారంటూ ఏకంగా హైకో ర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)పై బీసీ సంఘం అధ్యక్షుడి హోదాలో జస్టిస్‌ వి.ఈశ్వరయ్య రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, కేంద్రన్యాయశాఖ మంత్రికి ఫిర్యాదు చేశారని కౌంటర్‌లో పేర్కొన్నారు. ఇప్పుడు హైకోర్టును రెడ్‌జోన్‌గా ప్రకటించాలని, ఇటీవ ల కన్నుమూసిన ఇన్‌చార్జి రిజిస్ర్టార్‌ జనరల్‌ రాజశేఖర్‌ మృతిపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని దాఖలైన పిల్‌లోనూ ఈశ్వరయ్య చేసిన ఆరోపణలే ఉన్నాయన్నారు.


బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ సభ్యుడు జె.లక్ష్మీనరసయ్య హైకోర్టులో ఈ పిల్‌ దాఖలు చేయగా, దానిపై శుక్రవారం జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం ముందు విచారణ జరిగింది. ఈ పిల్‌కు విచారణార్హతే లేదంటూ రిజిస్ట్రార్‌ జనరల్‌ భానుమతి అన్నా రు. ఇటీవల కన్నుమూసిన ఇన్‌చార్జ్‌ రిజిస్ట్రార్‌ జనరల్‌ మృతిపై దురుద్దేశంతోనే దర్యాప్తు కోరుతున్నారన్నారు. అందువల్ల ఈ పిల్‌ దాఖలు చేసిన వారికి భారీ జరిమానా విధించాలని అభ్యర్థించారు.

Updated Date - 2020-08-01T09:59:15+05:30 IST