జస్టిస్‌ ఈశ్వరయ్య ఫోన్‌కు స్పందించనందుకే వేధిస్తున్నారు: జడ్జి రామకృష్ణ

ABN , First Publish Date - 2020-08-16T23:24:56+05:30 IST

జస్టిస్‌ ఈశ్వరయ్య ఫోన్‌కు స్పందించనందుకే ఇలా వేధిస్తున్నారని జడ్జి రామకృష్ణ తెలిపారు. బి.కొత్తకోట పోలీసులు తన తమ్ముడిని అక్రమంగా నిర్బంధించారని పేర్కొన్నారు.

జస్టిస్‌ ఈశ్వరయ్య ఫోన్‌కు స్పందించనందుకే వేధిస్తున్నారు: జడ్జి రామకృష్ణ

అమరావతి: జస్టిస్‌ ఈశ్వరయ్య ఫోన్‌కు స్పందించనందుకే ఇలా వేధిస్తున్నారని జడ్జి రామకృష్ణ తెలిపారు. బి.కొత్తకోట పోలీసులు తన తమ్ముడిని అక్రమంగా నిర్బంధించారని పేర్కొన్నారు. సివిల్ కేసులో పీఎస్‌కు తీసుకెళ్లి తన తమ్ముడిని హింసిస్తున్నారని, తనను స్టేషన్‌కు రప్పించకపోతే ఎన్‌కౌంటర్‌ చేస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు. ఎస్పీ, డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని ఆరోపించారు. జస్టిస్ ఈశ్వరయ్య తనకు శనివారం నాలుగుసార్లు ఫోన్ చేశారని, తాను స్పందించలేదని రామకృష్ణ చెప్పారు. 

Updated Date - 2020-08-16T23:24:56+05:30 IST