విజయసాయిని కలిసినా న్యాయం జరగలేదు: జోని కుమారి

ABN , First Publish Date - 2020-07-20T18:29:59+05:30 IST

వైసీపీలో ఉన్నతస్థాయిలో ఉన్న పెద్దలు తనను మోసం చేశారని..

విజయసాయిని కలిసినా న్యాయం జరగలేదు: జోని కుమారి

విజయవాడ: వైసీపీలో ఉన్నతస్థాయిలో ఉన్న పెద్దలు తనను మోసం చేశారని ఏపీ మాలమహానాడు అధ్యక్షురాలు జోని కుమారి అన్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని సీఎం జగన్‌కు చెప్పుకునే అవకాశం లేదని ఆమె వాపోయారు. ఈ విషయమై ఈనెల 6న ఎంపీ విజయసాయి రెడ్డిని కలిసినా తనకు న్యాయం జరగలేదన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉండగానే ఆమె విషం తాగారు. విషయం తెలుసుకున్న పోలీసులు జోని కుమారిని ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2020-07-20T18:29:59+05:30 IST