ఆస్పత్రి పైనుంచి దూకి... కొవిడ్‌ బాధితుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-08-20T06:55:05+05:30 IST

రాజానగరం, ఆగస్టు 19: కొవిడ్‌ సోకిన ఓ వ్యక్తి ఆస్పత్రి భవనంపై నుంచి దూకి

ఆస్పత్రి పైనుంచి దూకి... కొవిడ్‌ బాధితుడి ఆత్మహత్య

రాజానగరం, ఆగస్టు 19: కొవిడ్‌ సోకిన ఓ వ్యక్తి ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజమహేంద్రవరానికి చెందిన వ్యక్తి(40) జిల్లా కోర్టులో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఆయనకు కరోనా రావడంతో బొమ్మూరు, హోం క్వారంటైన్‌లలో ఉన్నాడు. తర్వాత జీఎ్‌సఎల్‌ కొవిడ్‌ ఆస్పత్రిలో చేరాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఆస్పత్రిలోని నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 

Read more