అక్రమ నిర్బంధంపై ‘స్వతంత్ర’ దర్యాప్తు ఎందుకొద్దు?

ABN , First Publish Date - 2020-10-13T09:22:12+05:30 IST

జ్యుడీషియ రీ విచారణ నివేదికతో పోలీసులు విభేదిస్తున్నందున.. అక్రమ నిర్బంధ కేసును సీబీఐ లేదా స్వతంత్ర ..

అక్రమ నిర్బంధంపై ‘స్వతంత్ర’ దర్యాప్తు ఎందుకొద్దు?

ముగిసిన ‘తూర్పు’ కేసులోనూ వాస్తవాలు తెలియాలి: హైకోర్టు

‘రాజ్యాంగ విచ్ఛిన్నం’పై వాదనలు

పిటిషనర్ల తరఫు న్యాయవాదులకు సూచన


అమరావతి, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): జ్యుడీషియ రీ విచారణ నివేదికతో పోలీసులు విభేదిస్తున్నందున.. అక్రమ నిర్బంధ కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యా ప్తు సంస్థకు ఎందుకు అప్పగించరాదో చెప్పాలని ప్రభు త్వ ప్రత్యేక కౌన్సిల్‌ను హైకోర్టు ఆదేశించింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ న్యాయవాది ఇంట్లోకి పోలీసులు అర్ధరాత్రి చొరబడి, ఆయన్ను అక్రమంగా నిర్బంధించారంటూ దాఖలైన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను కూడా మంగళవారం నాటి విచారణ జాబితాలో పెట్టాలని రిజిస్ట్రీని ఆదేశించింది. రాష్ట్రంలో ‘రాజ్యాంగ విచ్ఛి న్నం’ జరిగిందా లేదా అన్నదానిపై వాదనలు వినిపించాలని పోలీసుల అక్రమ నిర్బంధ పిటిషనర్ల తరఫు న్యాయవాదులకు సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చే సింది. అక్రమ నిర్బంధానికి సంబంధించి హైకోర్టులో దాఖలైన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం రాష్ట్రంలో ‘రాజ్యాంగ విచ్ఛి న్నం’ జరిగిందా లేదా అన్నది తేలుస్తామని స్పష్టం చే సిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై సోమవారం మరోమారు విచారణ జరిగింది. ఓ దంపతులను పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ దాఖలైన పిటిషన్‌పై ప్రభుత్వ ప్రత్యేక కౌన్సిల్‌, సీనియర్‌ న్యాయవాది ఎస్‌ఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపించారు.


ఆ పిటిషన్‌ ఉపసంహరించుకోవాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిపై పోలీసులు ఎలాంటి ఒత్తిడీ తీసుకురాలేదన్నారు. ఆ న్యాయవాది ఇంట్లో పోలీసులు చేసిన తనిఖీ.. ఆ వ్యవహారానికి సంబంధించినది కాదన్నారు. ఆ వ్యవహారంలో కొన్ని లోపాలున్నప్పటికీ అది కావాలని చేయలేదన్నారు. జ్యుడీషియరీ విచారణ నివేదిక కూడా సమగ్రంగా లేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. జ్యుడీషియ రీ విచారణ ద్వారా వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లు పిటిషనర్‌ చెబుతున్నారని, కానీ ప్రతివాదులు దాంతో విభేదిస్తున్నందున స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయిస్తామంది.


ఎందుకు స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచార ణ చేయించకూడదో చెప్పాలని ఆదేశించింది. ఇందుకు ఎస్‌ఎస్‌ ప్రసాద్‌ సమాధానమిస్తూ.. దీనిలో పోలీసు ఉన్నతాధికారులపై ఆరోపణలు లేవని, స్వతంత్ర ద ర్యాప్తు సంస్థ అవసరం లేదన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుని.. ఈ పిటిషన్‌ వ్యవహారంలో జరిగినట్లుగానే.. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ న్యాయవాదిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ దా ఖలైన కేసును న్యాయవాది ఉపసంహరించుకున్నార ని, ఆ కేసులోనూ వాస్తవాలు తెలుసుకోవాలనుకుంటున్నామని వ్యాఖ్యానించింది. ప్రసాద్‌ వాదనల కొనసాగింపుకు విచారణనుమంగళవారానికివాయిదా వేసింది.

Updated Date - 2020-10-13T09:22:12+05:30 IST