జడ్జి రామకృష్ణ తమ్ముడు రామచంద్రను దౌర్జన్యంగా పీఎస్‌కు తరలింపు

ABN , First Publish Date - 2020-08-16T23:33:56+05:30 IST

జడ్జి రామకృష్ణ తమ్ముడు రామచంద్రను దౌర్జన్యంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మహిళల పట్ల రామచంద్ర అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణతో బలవంతంగా స్టేషన్‌కు

జడ్జి రామకృష్ణ తమ్ముడు రామచంద్రను దౌర్జన్యంగా పీఎస్‌కు తరలింపు

చిత్తూరు: జడ్జి రామకృష్ణ తమ్ముడు రామచంద్రను దౌర్జన్యంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మహిళల పట్ల రామచంద్ర అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణతో బలవంతంగా స్టేషన్‌కు బి.కొత్తకోట పోలీసులు తరలించారు. భూవివాదం కేసు కోర్టులో నడుస్తున్న సమయంలో కావాలనే తమపై అక్రమకేసులు పెడుతున్నారని జడ్జి రామకృష్ణ తమ్ముడు రామచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. సివిల్ కేసులో పీఎస్‌కు తీసుకెళ్లి తన తమ్ముడిని హింసిస్తున్నారని, తనను స్టేషన్‌కు రప్పించకపోతే ఎన్‌కౌంటర్‌ చేస్తామని బెదిరిస్తున్నారని, ఎస్పీ, డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని జడ్జి రామకృష్ణ వాపోయారు.


Updated Date - 2020-08-16T23:33:56+05:30 IST