‘ఏపీ నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్’ అంటూ పోస్టర్

ABN , First Publish Date - 2020-12-28T18:51:21+05:30 IST

ఏపీ రాజకీయాల్లో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎప్పుడూ ఉండనే ఉంటుంది. టీడీపీ అభిమానులు, నందమూరి వంశాభిమానులనేగాక రాజకీయాల్లోకి ఆయన రాకకోసం

‘ఏపీ నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్’ అంటూ పోస్టర్

ఒంగోలు: ఏపీ రాజకీయాల్లో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎప్పుడూ ఉండనే ఉంటుంది. టీడీపీ అభిమానులు, నందమూరి వంశాభిమానులనేగాక రాజకీయాల్లోకి ఆయన రాకకోసం ఎదురు చూస్తున్నవారు చాలా మంది ఉన్నారు. తాజాగా ఆయనకు సంబంధించిన ఫ్లెక్సీ ఒకటి టీడీపీలో కలకలం సృష్టిస్తోంది. ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెంలో చర్చకు దారి తీసింది. ఏపీకి నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఓ ఫ్లెక్సీని అభిమానులు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోతో పాటూ టీడీపీ నేతల ఫోటోలు ఉన్నాయి. దీంతో జిల్లా టీడీపీలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఫ్లెక్సీని ఎవరు ఏర్పాటు చేశారనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. 

Updated Date - 2020-12-28T18:51:21+05:30 IST