రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం

ABN , First Publish Date - 2020-12-16T00:33:08+05:30 IST

రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేసిన రైల్వే ఉద్యోగి కిలారి నాగేశ్వరరావును గాజువాక పోలీసులు అరెస్ట్ చేశారు.

రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం

విశాఖ: రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేసిన  రైల్వే ఉద్యోగి కిలారి నాగేశ్వరరావును గాజువాక పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిందితుడు ప్రచారం చేశాడు. ప్రకటన చూసి నిందితుడి దగ్గరకు వచ్చిన నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు. ఉద్యోగాలు రాకపోవడంతో తాము మోసపోయినట్లు తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు  నిందితుడిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేపట్టారు. నిందితుడు నిరుద్యోగుల నుంచి సుమారు రూ.8లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Read more