పెద్ద జీయంగార్‌ను మఠానికి తరలించడానికి లైన్ క్లియర్
ABN , First Publish Date - 2020-07-19T01:50:15+05:30 IST
పెద్ద జీయంగార్‌కు వైద్య పరీక్షలు ముగిశాయి. స్వీమ్స్ నుంచి పెద్ద జీయంగార్‌ను మఠానికి తరలించడానికి లైన్ క్లియర్ అయింది. జీయంగార్‌ను తరలింపుకు వైద్యులు అనుమతించారు.

తిరుపతి: పెద్ద జీయంగార్‌కు వైద్య పరీక్షలు ముగిశాయి. స్వీమ్స్ నుంచి పెద్ద జీయంగార్‌ను మఠానికి తరలించడానికి లైన్ క్లియర్ అయింది. జీయంగార్‌ను తరలింపుకు వైద్యులు అనుమతించారు. మరికాసేపట్లో తిరుపతిలోని పెద్ద జియ్యంగార్లు మఠానికి పెద్ద, చిన్నజియ్యంగార్లు చేరుకోనున్నారు. మఠంలోనే చాతుర్మాస ధీక్షను జియ్యంగార్లు కోనసాగించనున్నారు. జీయంగార్‌ను అపోలో, టీటీడీ ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షించనున్నారు. మఠం వీధిలో రాకపోకలను పోలీసులు బంద్ చేశారు. తిరుమల ఆలయ పెద్ద జీయంగార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. చాతుర్మాస దీక్షలో ఉన్న జీయంగార్ కోరిక మేరకు వైద్య సేవలు అందించాలని వైద్యులను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు.