జగన్ పాలనపై జేసీ సెటైర్లు

ABN , First Publish Date - 2020-03-05T00:38:35+05:30 IST

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయనని టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.

జగన్ పాలనపై జేసీ సెటైర్లు

అనంతపురం: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయనని టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నిస్థానాలు ఏకగ్రీవం చేసుకునేందుకే... వైసీపీ ప్రభుత్వం స్థానిక ఎన్నికల కోసం కొత్త చట్టం తీసుకొస్తోందని విమర్శించారు. జగన్‌ నవమాసాల పాలన భేష్‌ అని ఎద్దేవా చేశారు. వైజాగ్‌ ఎయిర్‌పోర్టులో చంద్రబాబును కొట్టకపోవడం ఆయన అదృష్టమని అన్నారు. చంద్రబాబును పోలీసులు కిందేసి చావగొట్టకపోవడం సంతోషమని జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-03-05T00:38:35+05:30 IST