కాసేపట్లో జైలు నుంచి విడుదల కానున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-08-20T22:21:43+05:30 IST

టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి కాసేపట్లో జైలు నుంచి విడుదల కానున్నారు. ఇటీవల ప్రభాకర్‌రెడ్డిపై కరోనా నిబంధనల ఉల్లంఘన, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లనూ మోపారు.

కాసేపట్లో జైలు నుంచి విడుదల కానున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి

కడప: టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి కాసేపట్లో జైలు నుంచి విడుదల కానున్నారు. ఇటీవల ప్రభాకర్‌రెడ్డిపై కరోనా నిబంధనల ఉల్లంఘన, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లనూ మోపారు. అయితే జేసీకి కరోనా నిర్ధారణ కావడంతో బెయిల్ మంజూరు చేశారు. చికిత్స కోసం ఆయన హైదరాబాద్‌కు తీసుకెళ్లనున్నట్లు సమాచారం. గతంలో తనకు గుండె శస్త్రచికిత్స జరిగిందని, అత్యవసర పరిస్థితిని గుర్తించి బెయిల్ మంజూరు చేయాలని ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో గురువారం తాడిపత్రి కోర్టు ప్రభాకర్‌రెడ్డికి బెయిల్ ఇచ్చింది. ప్రభాకర్‌రెడ్డి ఆయన తనయుడు అస్మిత్‌రెడ్డి అక్రమ వాహనాల కేసులో అనంతపురం పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిద్దరూ కడప సెంట్రల్ జైల్లో 55 రోజులు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. 


అనంతపురం కోర్టు బెయిల్ ఇవ్వడంతో కడప జైలు నుంచి విడుదలైన ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌ తాడిపత్రికి బయలుదేరారు. సజ్జలదిన్నె సమీపంలో తనిఖీల కోసం వారి కాన్వాయ్‌ను సీఐ దేవేంద్రకుమార్‌ ఆపారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో కులం పేరుతో తనపై ఆయన దుర్భాషలాడినట్టు సీఐ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఐ దేవేంద్రకుమార్‌  ఫిర్యాదుతో పెట్టిన ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు. రెండోవది కొవిడ్‌ నిబంధనలను మీరిన కేసు. వీటితోపాటు 506, 189, 353, 52 సెక్షన్‌ల కింద మరో నాలుగు కేసులు మోపారు. 

Updated Date - 2020-08-20T22:21:43+05:30 IST