ముగిసిన పోలీస్‌ కస్టడీ

ABN , First Publish Date - 2020-06-23T09:48:56+05:30 IST

వాహనాల అక్రమ రిజిస్ర్టేషన్‌ల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి,

ముగిసిన పోలీస్‌ కస్టడీ

  • కడప సెంట్రల్‌ జైలుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి తరలింపు


అనంతపురం/కడప (క్రైం), జూన్‌ 22(ఆంధ్రజ్యోతి) : వాహనాల అక్రమ రిజిస్ర్టేషన్‌ల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిల రెండ్రోజుల పోలీస్‌ కస్టడీ సోమవారం ముగిసింది. కడప సెంట్రల్‌ జైలులో జుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న తండ్రీకొడుకులను విచారణ నిమిత్తం అనంతపురం వన్‌టౌన్‌ పోలీసులు కస్టడీలోకి తీసుకుని శనివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం 11 గంటల వరకూ విచారించారు. విచారణ ముగియడంతో వారిద్దరికీ అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం తిరిగి మేజిస్ర్టేట్‌ ఎదుట హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో తిరిగి వారిని కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి తరపు న్యాయవాది రవికుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. విచారణ అధికారులు అడిగిన 66 ప్రశ్నలకు తగిన ఆధారాలతో ప్రభాకర్‌రెడ్డి సమాధానాలు ఇచ్చారన్నారు.

Updated Date - 2020-06-23T09:48:56+05:30 IST