విచారణలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఏం చెప్పారంటే..: లాయర్

ABN , First Publish Date - 2020-06-22T18:07:26+05:30 IST

విచారణ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తగిన ఆధారాలతో జేసీ ప్రభాకరరెడ్డి సమాధానమిచ్చారని ఆయన తరుపు అడ్వకేట్ నార్పల రవికుమార్‌రెడ్డి

విచారణలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఏం చెప్పారంటే..: లాయర్

అనంతపురం: విచారణ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తగిన ఆధారాలతో జేసీ ప్రభాకరరెడ్డి సమాధానమిచ్చారని ఆయన తరుపు అడ్వకేట్ నార్పల రవికుమార్‌రెడ్డి తెలిపారు. ఈ వ్యవహారంలో ఎవరిని విచారిస్తే నిజాలు బయటపడతాయో ఆ వివరాలన్నింటిని విచారణ అధికారులకు  చెప్పడం జరిగిందని చెప్పారు. రెండు రోజుల సమయాన్ని పోలీసులు పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారని స్పష్టం చేశారు. మరోసారి కస్టడీకి తీసుకునే అవకాశం ఉండకపోవచ్చన్నారు. బెయిల్ కోసం దరఖాస్తు చేశామని.. ఇవాళ గానీ రేపు గానీ విచారణకు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. మల్టిపుల్ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నారని.. ఒకే ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్ చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని పేర్కొన్నారు. జేసీ ప్రభాకర రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపారు. అలాగే తుంటి ఎముక నొప్పిగా ఉండటంతో ఎక్స్‌రే కూడా తీశారని చెప్పారు. మెడికల్ రిపోర్టులను మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టామన్నారు. కస్టడీ ముగియడంతో మరోసారి కడప జిల్లా జైలుకు తరలించారని జేసీ ప్రభాకరరెడ్డి అడ్వకేట్ నార్పల రవికుమార్‌రెడ్డి వివరించారు.


Updated Date - 2020-06-22T18:07:26+05:30 IST