జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు ముగిసిన పోలీస్ కస్టడీ

ABN , First Publish Date - 2020-06-22T16:20:41+05:30 IST

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిలకు పోలీస్ కస్టడీ ముగిసింది. దీంతో ఇద్దరినీ వైద్య పరీక్షల నిమిత్తం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రభుత్వ సర్వజన

జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు ముగిసిన పోలీస్ కస్టడీ

అనంతపురం: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిలకు పోలీస్ కస్టడీ ముగిసింది. దీంతో ఇద్దరినీ వైద్య పరీక్షల నిమిత్తం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తయిన తరువాత వారిని అనంతపురం నుంచి కడప జిల్లా జైలుకు తరలించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు కడప జిల్లా జైలుకు తరలించనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

Updated Date - 2020-06-22T16:20:41+05:30 IST