దాడులను నిరసిస్తే అరెస్టులా?: జేసీ పవన్‌

ABN , First Publish Date - 2020-11-25T09:06:00+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలపై దాడులు, మహిళలపై సాగిస్తున్న ఆకృత్యాలను నిరసిస్తే.. అరెస్టులు చేయడమేంటని అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ జేసీ పవన్‌ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆకృత్యాలు, అక్రమ కేసులను నిరసిస్తూ.. ఆయన నగరంలో మంగళవారం బైక్‌ ర్యాలీకి

దాడులను నిరసిస్తే అరెస్టులా?: జేసీ పవన్‌

అనంతలో బైక్‌ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు


అనంతపురం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలపై దాడులు, మహిళలపై సాగిస్తున్న ఆకృత్యాలను నిరసిస్తే.. అరెస్టులు చేయడమేంటని అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ జేసీ పవన్‌ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆకృత్యాలు, అక్రమ కేసులను నిరసిస్తూ.. ఆయన నగరంలో మంగళవారం బైక్‌ ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పెద్దఎత్తున పార్టీ శ్రేణులు, యువత.. పవన్‌రెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. సాయంత్రం 4 గంటలకు బైక్‌ ర్యాలీ ప్రారంభించగానే నగరంలోని పోలీసు అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా అక్కడికి చేరుకుని అనుమతి లేదంటూ అడ్డుకున్నారు.


ఈ క్రమంలో పోలీసులు, తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం తలెత్తింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ ఆందోళన కొనసాగుతుండగానే  పోలీసులు.. పవన్‌రెడ్డిని బలవంతంగా అరెస్టు చేసి, టూటౌన్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆయనను సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలీసు బెదిరింపులు, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. 

Read more