జగన్ చాలా తెలివైనవాడు: జేసీ దివాకర్‌రెడ్డి
ABN , First Publish Date - 2020-03-16T19:11:29+05:30 IST
ఏపీ సీఎం జగన్ చాలా తెలివైనవాడని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసేందుకు ఎన్నికల సంఘం కార్యాలయానికి వచ్చిన జేసీ మీడియాతో మాట్లాడుతూ..
అమరావతి: ఏపీ సీఎం జగన్ చాలా తెలివైనవాడని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసేందుకు ఎన్నికల సంఘం కార్యాలయానికి వచ్చిన జేసీ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఈసీ, గవర్నర్ ఎవరూ ఉండకూడదని, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా ఒక్కరే ఉండి.. పోలీసులు ఉంటే సరిపోతుందంటూ జగన్ తీరును జేసీ ఎండగట్టారు. రాష్ట్రంలో ఓ భస్మాసురుడు ఉన్నాడని, తన నెత్తిమీద తానే చేయి పెట్టుకుంటున్నాడని, ఆ భస్మాసురుడు ఎవరో ప్రజలకు తెలుసని దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయడం స్వాగతించదగ్గ నిర్ణయమేనని, అందువల్ల మద్యం, డబ్బు పంపిణీ చాలా వరకు తగ్గుతుందని చెప్పారు. తాను టీడీపీ అయినంత మాత్రాన ప్రతిదీ విమర్శించాలని లేదని చెబుతూ.. జగన్ చాలా తెలివైన వాడని సెటైర్ వేశారు. ప్రతి ఒక్కరికీ సమాజిక వర్గం ఉంటుందని, అది లేని వారు ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు.