వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి వైద్యం తెలీదు: జవహర్‌

ABN , First Publish Date - 2020-12-08T01:07:30+05:30 IST

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఏలూరులో ప్రజలు అంతుపట్టని వ్యాధితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ సీనియర్ నాయకుడు జవహర్‌ వ్యాఖ్యానించారు.

వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి వైద్యం తెలీదు: జవహర్‌

ప.గో: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే  ఏలూరులో ప్రజలు అంతుపట్టని వ్యాధితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని  టీడీపీ సీనియర్ నాయకుడు జవహర్‌ వ్యాఖ్యానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ప్రభుత్వ అసమర్ధతతోనే ఏలూరులో వింత రోగం బారిన పడి 443 మంది ఆస్పత్రి పాలయ్యారని వారిని చూస్తేంటే బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస పరిజ్ఞానం లేని మంత్రులు రాష్ట్రంలో ఉన్నారని మండిపడ్డారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి వైద్యం అంటే తెలీదని ఎద్దేవా చేశారు. బాధితులకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-12-08T01:07:30+05:30 IST