ప్రభుత్వం ప్రజల బలహీనతను సొమ్ముచేసుకుంటోంది: జవహర్

ABN , First Publish Date - 2020-05-08T20:45:57+05:30 IST

మద్యం వ్యవస్థను ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చిందని..

ప్రభుత్వం ప్రజల బలహీనతను సొమ్ముచేసుకుంటోంది: జవహర్

అమరావతి: మద్యం వ్యవస్థను ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చిందని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దీన్ని పూర్తిగా వ్యాపార దృక్పదంతోనే నడిపిస్తోందని ఆరోపించారు. కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టి, ప్రజల బలహీనతను సొమ్ముచేసుకునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. అధిక రేట్లు పెడితే మద్యం ఎవరూ కొనరని, దీంతో మద్యపాన నిషేధం అమలు చేయవచ్చునని చెబుతుంటే..ఇది ప్రభుత్వం అజ్ఞానమనోలా? వ్యాపార దృక్పధమనోలో తెలియడంలేదని అన్నారు. ఒక్క తేనె చుక్కతో సముద్రాన్ని తీయదనం చేయవచ్చుననే అజ్ఞానంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని విమర్శించారు. పర్యవేక్షణ అధికారులు మద్యం దుకాణాల్లో విధులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. 

Updated Date - 2020-05-08T20:45:57+05:30 IST