పేటీఎమ్ బ్యాచ్‌ని నిలదీస్తే...: జవహర్
ABN , First Publish Date - 2020-10-28T20:51:26+05:30 IST
పేటీఎమ్ బ్యాచ్‌ని నిలదీస్తే...: జవహర్

అమరావతి: రైతులకు బేడీలు వేయడం ప్రభుత్వ సిగ్గుమాలిన చర్య అని మాజీ మంత్రి జవహర్ అన్నారు. డబ్బులకోసం ఉద్యమాలు చేయడానికి వచ్చేవారిని నిలదీయాలని స్థానిక డీఎస్పీనే రాజధాని రైతులకు చెప్పాడని పేర్కొన్నారు. పేటీఎమ్ బ్యాచ్‌ని నిలదీస్తే.. రైతులపై తప్పుడు కేసులు పెడతారా? అని ఆయన ప్రశ్నించారు. రైతులకు బేడీలేసిన ఘటనలో డీజీపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.