జంగారెడ్డిగూడెంలో తొలి కరోనా పాజిటివ్ నమోదు

ABN , First Publish Date - 2020-07-09T02:31:39+05:30 IST

జిల్లాలోని జంగారెడ్డి గూడెం పట్టణంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. స్థానిక అయ్యన్న కాలనీలో నివాసముంటున్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. సమాచారం అందుకున్న

జంగారెడ్డిగూడెంలో తొలి కరోనా పాజిటివ్ నమోదు

పశ్చిమగోదావరి: జిల్లాలోని జంగారెడ్డి గూడెం పట్టణంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. స్థానిక అయ్యన్న కాలనీలో నివాసముంటున్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు. అతని నివాసముంటున్న ప్రాంతాన్నంతా శానిటైజేషన్ చేశారు. కరోనా బాధిత వ్యక్తిని ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. సదరు బాధితుడు ఇటీవల విజయవాడలోని ఓ ఆస్పత్రిలో గుండె ఆపరేషన్ చేయించుకుని జంగారెడ్డిగూడెం వచ్చాడు. అయితే తీవ్ర అస్వస్థతతో ఇబ్బంది పడుతుండటంతో అతనికి కరోనా టెస్ట్ చేశారు. ఈ టెస్టుల్లో పాజిటివ్ అని తేలింది.

Updated Date - 2020-07-09T02:31:39+05:30 IST