అంతర్వేది ఘటనలో విజయసాయిరెడ్డిని సీబీఐ విచారించాలి: జంగా గౌతమ్

ABN , First Publish Date - 2020-09-12T18:43:53+05:30 IST

అమరావతి: అంతర్వేది రథం దగ్ధం విషయంలో సీబీఐ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని విచారించాలని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు జంగా గౌతమ్ డిమాండ్ చేశారు.

అంతర్వేది ఘటనలో విజయసాయిరెడ్డిని సీబీఐ విచారించాలి: జంగా గౌతమ్

అమరావతి: అంతర్వేది రథం దగ్ధం విషయంలో సీబీఐ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని విచారించాలని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు జంగా గౌతమ్ డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డి వద్ద ఉన్న ఆధారాలు స్వీకరించాలన్నారు. అసలు కుట్రదారు చంద్రబాబు అని.. విజయసాయిరెడ్డి తేల్చేస్తే ఇక ప్రభుత్వం విచారణకు సీబీఐకి కేసు ఎందుకు  ఇచ్చిందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని జంగా గౌతమ్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో తగిన ఆధారాలు చూపలేకపోతే విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేయాలన్నారు. లేదంటే అంతర్వేది రథం దగ్ధం విషయంలో సీబీఐ విచారణను తప్పుతోవ పట్టించేలా మాట్లాడినందుకు విజయసాయిరెడ్డిని అరెస్టు చేసి శిక్షించాలని జంగా గౌతమ్ డిమాండ్ చేశారు.

Updated Date - 2020-09-12T18:43:53+05:30 IST