కరోనా వైర్‌సపై అవగాహనకు టోల్‌ఫ్రీ

ABN , First Publish Date - 2020-03-23T09:36:36+05:30 IST

పట్టణాల్లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ

కరోనా వైర్‌సపై అవగాహనకు టోల్‌ఫ్రీ

అమరావతి, మార్చి 22(ఆంధ్రజ్యోతి): పట్టణాల్లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు   ప్రభుత్వ ఆదేశాల మేరకు కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ విజయకుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో టోల్‌ఫ్రీ 180059924365 నంబరు నిరంతరం అందుబాటులో ఉంటుందని, పట్టణ ప్రాంత ప్రజలు సంప్రదించి కరోనా వైర్‌సకు సంబంధించిన సలహాలు, సూచనలు పొందవచ్చని సూచించారు. పరిసరాల పారిశుధ్య సమస్యలపైనా ఫిర్యాదు చేసి పరిష్కారం పొందవచ్చని పేర్కొన్నారు.

Updated Date - 2020-03-23T09:36:36+05:30 IST