నో షేక్‌హ్యాండ్‌.. నో వైరస్‌..!

ABN , First Publish Date - 2020-03-23T09:51:56+05:30 IST

కరోనా వైరస్‌ ప్రబలకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విజయగనరం జిల్లా పార్వతీపురం సర్కిల్‌ పోలీసులు శనివారం విడుదల చేసిన వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది.

నో షేక్‌హ్యాండ్‌.. నో వైరస్‌..!

ఆకట్టుకుంటున్న పార్వతీపురం పోలీసుల వీడియో

కరోనా వైరస్‌ ప్రబలకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విజయగనరం జిల్లా పార్వతీపురం సర్కిల్‌ పోలీసులు శనివారం విడుదల చేసిన వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. పార్వతీపురం సర్కిల్‌లోని ఎస్సైలు, కానిస్టేబుళ్లు మాస్కులు ధరించి ఇటీవల బాగా పాపులర్‌ అయిన సినిమా పాట బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌కు లయబద్దంగా డ్యాన్స్‌ చేస్తూ.. అదే సమయంలో కరచాలనం వద్దు.. నమస్కారం ముద్దు, ప్రతి ఒక్కరూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, మాస్కులు ధరించాలి.. అనే సందేశాన్ని ఈ వీడియో ద్వారా అందించారు. దీనిపై సీఐ దాశరథి మాట్లాడుతూ ఏఎస్పీ ఆదేశాల మేరకు ఈ వీడియో రూపొందించామని చెప్పారు. పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు పోలీసులను అభినందించారు.

- పార్వతీపురం

Updated Date - 2020-03-23T09:51:56+05:30 IST