-
-
Home » Andhra Pradesh » Janata curfew Coronavirus jagan
-
సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికీ సెల్యూట్: జగన్
ABN , First Publish Date - 2020-03-23T09:58:57+05:30 IST
కరోనా వైర్‌సను దరికి రాకుండా తరిమివేసేందుకు ఆర్యోగ పరిరక్షణలో భాగంగా సేవలందిస్తున్న సైనికులు, స్థానిక పోలీసులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందికి...

అమరావతి, మార్చి 22(ఆంధ్రజ్యోతి): కరోనా వైర్‌సను దరికి రాకుండా తరిమివేసేందుకు ఆర్యోగ పరిరక్షణలో భాగంగా సేవలందిస్తున్న సైనికులు, స్థానిక పోలీసులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందికి... ఇలా నిరంతరం బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రతి ఒక్కరికీ సెల్యూట్ చేస్తున్నానని ముఖ్యమంత్రి జగన్ ట్విటర్‌లో పేర్కొన్నారు. జనతా కర్ఫ్యూను విజయవంతం చేసినందుకు రాష్ట్ర ప్రజలను అభినందించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో భాగంగా సాయంత్రం ఐదు గంటలకు సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సీఎస్ నీలం సాహ్ని, సీఎం కార్యాలయాధికారులతో కలసి వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసు సిబ్బంది సేవలను అభినందిస్తూ ఐదు నిమిషాల పాటు చప్పట్లు కొట్టారు.