-
-
Home » Andhra Pradesh » Janata curfew Coronavirus
-
31 వరకు రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు మూసివేత
ABN , First Publish Date - 2020-03-23T09:29:34+05:30 IST
ఇప్పటికే అన్ని రకాల ప్రయాణికుల రైళ్ల రాకపోకలను నిలిపివేసిన దక్షిణ మధ్య రైల్వే.. సోమవారం నుంచి అన్ని రైల్వేస్టేషన్లలోని రిజర్వేషన్ కౌంటర్లు, అన్ రిజర్వ్‌డ్ టికెట్ కౌంటర్లు

యాప్ బుకింగ్, పార్శిల్ ఆఫీసులు కూడా..
చిత్తూరు కలెక్టరేట్, మార్చి 22: ఇప్పటికే అన్ని రకాల ప్రయాణికుల రైళ్ల రాకపోకలను నిలిపివేసిన దక్షిణ మధ్య రైల్వే.. సోమవారం నుంచి అన్ని రైల్వేస్టేషన్లలోని రిజర్వేషన్ కౌంటర్లు, అన్ రిజర్వ్‌డ్ టికెట్ కౌంటర్లు, పార్శిల్, లగేజీ ఆఫీసులను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 31వ తేదీ వరకు ఇది అమల్లో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే టికెట్లు రిజర్వ్ చేసుకున్న వారందరికీ జూన్ 21వ తేదీలోపు రీఫండ్ చేస్తామని వెల్లడించారు. కౌంటర్ల ద్వారా రిజర్వేషన్లు చేసుకున్నవారు కౌంటర్లు తెరిచాక గడువులోపు వచ్చి రీఫండ్ పొందవచ్చన్నారు. ఆన్‌లైన్ ద్వారా చేసుకున్నవారు ఆన్‌లైన్‌లోనే రీఫండ్ పొందే సౌలభ్యం ఉందని తెలిపారు. యాప్ ద్వారా అన్‌రిజర్వ్‌డ్ టికెట్లు బుకింగ్ చేసే సౌకర్యాన్ని కూడా ఈ నెలాఖరు వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.