పేదల కోసం రంగా జీవితాన్ని త్యాగం చేశారు: పోతిన మహేష్

ABN , First Publish Date - 2020-12-26T16:23:30+05:30 IST

పేద ప్రజల కోసం తన జీవితాన్నే రంగా త్యాగం చేశారని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ తెలిపారు. వంగవీటి రంగా 32వ వర్థంతి సందర్భంగా పోతిన మహేష్ నివాళులు

పేదల కోసం రంగా జీవితాన్ని త్యాగం చేశారు: పోతిన మహేష్

విజయవాడ: పేద ప్రజల కోసం తన జీవితాన్నే రంగా త్యాగం చేశారని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ తెలిపారు. వంగవీటి రంగా 32వ వర్థంతి సందర్భంగా పోతిన మహేష్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయాలని రంగా పోరాడారు. సమాజం పట్ల బాధ్యతగా ఉండేలా విద్యార్థి సంఘాల్లో అవగాహన కల్పించారు. కులాలు, మతాలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరి గుండెల్లో రంగ నిలిచారు. చిన్న జిల్లాల ఏర్పాటు నేపధ్యంలో ఒక జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోకుంటే..  రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తాం. రంగ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా మా వంతు కృషి చేస్తాం’ అని పోతిన మహేష్ స్పష్టం చేశారు.

Updated Date - 2020-12-26T16:23:30+05:30 IST