‘నేతన్న నేస్తం’ కొందరికేనా?: పవన్‌ కల్యాణ్‌

ABN , First Publish Date - 2020-06-23T09:51:37+05:30 IST

‘‘రాష్ట్రంలో ‘నేతన్న నేస్తం’ పథకం కొందరికే అమలు చేస్తారా?’’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. సొంత ఇల్లులేక, అద్దె

‘నేతన్న నేస్తం’ కొందరికేనా?: పవన్‌  కల్యాణ్‌

అమరావతి, జూన్‌  22(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో ‘నేతన్న నేస్తం’ పథకం కొందరికే అమలు చేస్తారా?’’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. సొంత ఇల్లులేక, అద్దె ఇంట్లో మగ్గం పెట్టుకోలేక, షెడ్డుల్లో మగ్గం పెట్టుకుని ఉపాధి పొందుతున్న నేత కార్మికులకు లబ్ధి చేకూర్చకపోవడం బాధపెడతోందన్నారు. ఈ పథకాన్ని కొందరికే వర్తింపజేయడం సహేతుకం కాదన్నారు. రాష్ట్రంలో చేనేత కార్మికులు 2.8 లక్షల మందికిపైగా ఉన్నారని... కానీ, ఈ పథకాన్ని కేవలం 81,024 మందికి మాత్రమే అర్హత కల్పించడం దారుణమని విమర్శించారు. నేత నేసే వారితోపాటు అద్ధకంపని, పడుగు, పేక, ఆసు పోయడం లాంటి అనేక అనుబంధ పనుల్లో ఉన్నవారు ఈ రంగంలో ఉన్నారన్నారు. ప్రతి కార్మికుడికి ఈ పథకం వర్తింపజేయాలని సూచించారు. సోమవారం అన్ని జిల్లాల చేనేత కార్మికులతో జనసేన అధ్యక్షుడు పవన్‌  కల్యాణ్‌ టెలీకాన్ఫరెన్‌ ్సలో మాట్లాడారు.

Read more