-
-
Home » Andhra Pradesh » Janasena President Pawan Kalyan
-
ఉత్తరాంధ్రలో నేతల ఆస్తులే వృద్ధి: పవన్
ABN , First Publish Date - 2020-05-18T10:20:53+05:30 IST
‘ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎన్నో జలవనరులు ఉ న్నాయి. వాటిని సద్వినియోగం చేసుకొంటే ఆ ప్రాంతం

అమరావతి, మే 17(ఆంధ్రజ్యోతి): ‘ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎన్నో జలవనరులు ఉ న్నాయి. వాటిని సద్వినియోగం చేసుకొంటే ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఆ దిశగా పని చేయాలనే చిత్తశుద్ధి ఉన్న ప్రజాప్రతినిధులు అవసరం’ అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. ఉత్తరాంధ్ర నాయకుల ఆస్తులు అభివృద్ధి చెందుతున్నాయిగానీ ప్రజలు మాత్రం కష్టాల్లోనే ఉంటున్నారని వ్యాఖ్యానించా రు. ఆదివారం ఆ జిల్లా పార్టీ నేతలతో పవన్ కల్యాణ్ టెలికాన్ఫరెన్ ్స నిర్వహించారు.
స్టైరిన్‌తోనూ సహజీవనం చేయాలా?
కరోనాతో కలిసి జీవించే పరిస్థితి తప్పదని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం... ఆర్‌ఆర్ వెంకటాపురం పరిసర గ్రామాల వారిని స్టైరిన్ అనే విషవాయువుతో సహజీవనం చేయవలసిందేనని తన చర్యల ద్వారా చప్పకనే చెబుతోందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శించారు. తగిన రక్షణ చర్యలు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ఘటన తీరు రుజువు చేస్తోందన్నారు.