పూజలోనూ దేశీయతకే ప్రాధాన్యం: పవన్‌ కల్యాణ్‌

ABN , First Publish Date - 2020-08-22T09:09:22+05:30 IST

స్వదేశీ పూజా ద్రవ్యాలతోనే వినాయకుణ్ణి పూజిద్దామని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు.

పూజలోనూ దేశీయతకే   ప్రాధాన్యం: పవన్‌ కల్యాణ్‌

అమరావతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): స్వదేశీ పూజా ద్రవ్యాలతోనే వినాయకుణ్ణి పూజిద్దామని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘కరోనా అనే భయంకర విఘ్నం నుంచి దేశ ప్రజలందరినీ కాపాడమని ముందుగా ఈ వినాయకుడ్ని ప్రార్థిస్తున్నా. ఈ సారి మన దేశభక్తిని ఈ పండుగలో ప్రతిబింబింపచేద్దాం. వినాయక పూజలో సైతం విదేశీ పూజా ద్రవ్యాలు సింహభాగం ఆక్రమించాయి. ఈ పూజ నుంచి అయినా మనం వాటిని త్యజిద్దాం. మన నేలపై తయారైన, పర్యావరణ హితమైన పూజా ద్రవ్యాలతోనే ఈ పండుగ జరుపుకొందాం’’ అని పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు, తెలుగు వారందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2020-08-22T09:09:22+05:30 IST