రైతుల పక్షాన తుదికంటా పోరాడతాం: పవన్‌

ABN , First Publish Date - 2020-08-01T09:08:51+05:30 IST

‘‘రాజధాని రైతుల పక్షాన తుదికంటా పోరాడతాం. రెండు బిల్లులు గవర్నర్‌ ఆమోదం పొందిన

రైతుల పక్షాన తుదికంటా పోరాడతాం: పవన్‌

అమరావతి, జూలై 31(ఆంధ్రజ్యోతి): ‘‘రాజధాని రైతుల పక్షాన తుదికంటా పోరాడతాం. రెండు బిల్లులు గవర్నర్‌ ఆమోదం పొందిన తరుణంలో ఉత్పన్నమయ్యే రైతుల పరిస్థితిపై జనసేన రాజకీయ వ్యవహరాల కమిటీలో చర్చించి భవిష్యత్తు ప్రణాళికను రూపొందిస్తాం. రైతులకు ఏ విధమైన అండదండలు అందించాలో ఈ సమావేశంలో దృష్టిపెడతాం’’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ప్రజలను కొవిడ్‌ మహమ్మారి పీడిస్తున్న నేపథ్యంలో మూడు రాజధానులపై నిర్ణయం సరి కాదన్నారు. 

Updated Date - 2020-08-01T09:08:51+05:30 IST