పశ్చిమగోదావరి జిల్లా జనసేన నేతలతో పవన్‌ టెలీకాన్ఫరెన్స్‌

ABN , First Publish Date - 2020-04-29T02:52:30+05:30 IST

జిల్లా జనసేన నేతలతో పవన్‌ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా చిన్నపాటి జ్వరం కాదు... ఊపిరితిత్తులపై ప్రభావం చూపే ప్రమాదం ఉందన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా జనసేన నేతలతో పవన్‌ టెలీకాన్ఫరెన్స్‌

పశ్చిమగోదావరి: జిల్లా జనసేన నేతలతో పవన్‌ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా చిన్నపాటి జ్వరం కాదు... ఊపిరితిత్తులపై ప్రభావం చూపే ప్రమాదం ఉందన్నారు. మెడికల్ జర్నల్స్... అధ్యయన పత్రాలు చెబుతున్న విషయమది అని పేర్కొన్నారు. సమస్యను పక్కదోవ పట్టించేందుకే వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. డ్రైవర్లు, వలసకార్మికలు, చిరుద్యోగుల సమస్యలు తన దృష్టికి వచ్చాయని తెలిపారు. ఇది చిన్నపాటి సాధారణ జ్వరం కాదనే వాస్తవం గుర్తించాలన్నారు. కాబట్టి కరోనా విషయంలో అందరం అప్రమత్తంగా ఉండాల్సిందేనని పవన్ స్పష్టం చేశారు.


ప్రధాని దూరదృష్టితో లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నా.. కొందరు హర్షించలేదన్నారు. జనసేన నేతలు, శ్రేణులు ఎవరూ సంయమనం కోల్పోవద్దని సూచించారు. వివాదాస్పద ప్రకటనలు, విమర్శలకు తగిన సమయంలో సమాధానం ఇద్దామన్నారు. సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు అండగా మనం నిలవాలని పిలుపునిచ్చారు. 

Updated Date - 2020-04-29T02:52:30+05:30 IST