-
-
Home » Andhra Pradesh » Janasena Party Power charges
-
విద్యుత్ చార్జీల పెంపుపై జనసేన పార్టీ నేతల నిరాహార దీక్ష
ABN , First Publish Date - 2020-05-18T15:51:33+05:30 IST
గుంటూరు: ప్రభుత్వ భూములు అమ్మకం, విద్యుత్ చార్జీల పెంపుపై జనసేన పార్టీ నిరహార దీక్షకు పూనుకుంది.

గుంటూరు: ప్రభుత్వ భూములు అమ్మకం, విద్యుత్ చార్జీల పెంపుపై జనసేన పార్టీ నిరహార దీక్షకు పూనుకుంది. జనసేన కార్యాలయంలో ఆ పార్టీ నేతలు దీక్ష చేపట్టారు. నగరంలోని పీవీకే నాయుడు కూరగాయలు మార్కెట్ అమ్మకాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కూరగాయలు వ్యాపారుల తరపున జనసేన పోరాటం చేస్తుందన్నారు. లాక్‌డౌన్ సమయంలో విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని బోనబోయిన, కే.కే, గాదె వెంకటేశ్వర రావు డిమాండ్ చేశారు.