మంత్రి క్షమాపణ చెప్పాలి: జనసేన నేత

ABN , First Publish Date - 2020-05-19T01:36:09+05:30 IST

దుర్గమ్మ భక్తులకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు బహిరంగ క్షమాపణ చెప్పాలని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ డిమాండ్ చేశారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన

మంత్రి క్షమాపణ చెప్పాలి: జనసేన నేత

విజయవాడ: దుర్గమ్మ భక్తులకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు బహిరంగ క్షమాపణ చెప్పాలని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ డిమాండ్ చేశారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. దుర్గమ్మ సన్నిధిలో రాజకీయ సమావేశాలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. అర్హతలేని అసమర్థ ఈవో అని సురేష్ బాబు మరోసారి రుజువు చేసుకున్నారని విమర్శించారు. దేవస్థానం పవిత్రతను, ప్రతిష్టను కాపాడాల్సిన మంత్రి.. వైసీపీ స్థానిక అభ్యర్థులతో సమావేశం ఎలా నిర్వహిస్తారని మహేష్ ప్రశ్నించారు. ఆలయ పరిధిలో రాజకీయ సమావేశం జరిపి భక్తుల మనోభావాలను ఘోరంగా దెబ్బ తీశారని, మంత్రి శ్రీనివాస్ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని మహేష్ డిమాండ్ చేశారు. దుర్గమ్మ సన్నిధిని వైసీపీ కార్యాలయంగా మార్చడంపై ఈవో సమాధానం చెప్పాలన్నారు. దుర్గమ్మ గుడికి వైసీపీ రంగులు వేసినా ఈవో చూస్తూ ఊరుకుంటారేమో అనే అనుమానం కలుగుతోందన్నారు. దుర్గ గుడిలో రాజకీయ సమావేశంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Updated Date - 2020-05-19T01:36:09+05:30 IST