నడ్డాతో పవన్ భేటీ.. తిరుపతి టికెట్‌పై చర్చ

ABN , First Publish Date - 2020-11-25T23:16:15+05:30 IST

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌ భేటీ

నడ్డాతో పవన్ భేటీ.. తిరుపతి టికెట్‌పై చర్చ

ఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌ భేటీ అయ్యారు. తిరుపతి ఉప ఎన్నిక, ఏపీ పరిణామాలపై చర్చిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బరి నుంచి జనసేన తప్పుకుంది. ఇక్కడ బీజేపీకి మద్దతు తెలిపింది. దీంతో తిరుపతి టికెట్ తమకు వదిలేయాలంటూ జనసేన కోరుతోంది. ఇది అంశంపై నడ్డాతో పవన్‌కల్యాణ్ చర్చిస్తున్నారు.


ఇదిలా ఉంటే ఇప్పటికే తిరుపతి టికెట్‌పై రాష్ట్ర బీజేపీ ఆశలు పెట్టుకుంది. దీనిపై సమీక్షలు కూడా నిర్వహించింది. జనసేనతో కలిసి పని చేస్తామని బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి బరిలో జనసేన అభ్యర్థి ఉంటారా? లేక బీజేపీ అభ్యర్థి ఉంటారా? అన్న అంశంపై సస్పెన్ష్ కొనసాగుతోంది.

Read more