వైద్యుల సేవలు సాహసోపేతం: పవన్
ABN , First Publish Date - 2020-04-08T09:46:44+05:30 IST
వ్యక్తిగతంగా కరోనా వైరస్ ముప్పు ఉందని తెలిసినా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది చేస్తున్న సేవలు సాహసోపేతమైనవని ..
అమరావతి, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): వ్యక్తిగతంగా కరోనా వైరస్ ముప్పు ఉందని తెలిసినా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది చేస్తున్న సేవలు సాహసోపేతమైనవని జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం ఒక ప్రకటనలో కొనియాడారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి ఆయన అభినందనలు తెలియజేశారు.