ఈ-సేవా ఉద్యోగుల్ని ఆదుకోండి: ప్రభుత్వానికి పవన్ వినతి

ABN , First Publish Date - 2020-10-08T00:55:19+05:30 IST

ఈ-సేవా ఉద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ డిమాండ్ చేశారు. ‘పదిహేడేళ్ళ నుంచి ఈ-సేవలో కాంట్రాక్ట్ పద్ధతిలో

ఈ-సేవా ఉద్యోగుల్ని ఆదుకోండి: ప్రభుత్వానికి పవన్ వినతి

అమరావతి: ఈ-సేవా ఉద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ డిమాండ్ చేశారు. ‘పదిహేడేళ్ళ నుంచి ఈ-సేవలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు చేస్తున్నవారు ఒక్కసారిగా రోడ్డునపడటం చాలా బాధాకరం. కరోనా విపత్తు మూలంగా లాక్‌డౌన్ విధించిన క్రమంలో ఆ ఉద్యోగులకు గత 5 నెలలుగా జీతాలు కూడా చెల్లించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ ఈ-సేవ కేంద్రాల్లో వివిధ ఉద్యోగాల్లో 607 మంది ఉన్నారు. వీరంతా నెలల తరబడి జీతాలు రాకపోవడం మూలంగా కష్ట, నష్టాల్లోఉన్నారు. కుటుంబాలు పోషణకు ధీమా... ఉపాధికి హామీ లేక ఆవేదనలో ఉన్నారు. ఈ-సేవ కేంద్రాల ద్వారా సేవా రుసుముల రూపేణా రూ.వేల కోట్ల ఆదాయం కూడా ప్రభుత్వానికి సమకూరుతోంది. ఈ కేంద్రాలకు సంబంధించిన విధుల్లో ఉన్న ఉద్యోగులను ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్ సర్వీసెస్ (ఆప్కాస్) పరిధిలోకి తీసుకొని వారి ఉపాధికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆ ఉద్యోగుల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలి’ అని పవన్ విజ్ఞప్తి చేశారు.

Read more