బీజేపీ కంటే మాదే బలమైన పార్టీ

ABN , First Publish Date - 2020-12-20T08:43:35+05:30 IST

రాష్ట్రంలో బీజేపీ కన్నా క్యాడర్‌ బాగున్న తమ పార్టీయే బలమైనదని జనసేన నాయకులు పేర్కొన్నారు. జనసేన తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు శనివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియా

బీజేపీ కంటే మాదే బలమైన పార్టీ

అభ్యర్థిని నడ్డా, పవన్‌ నిర్ణయిస్తారు: జనసేన 


తిరుపతి(తిలక్‌రోడ్డు), డిసెంబరు 19: రాష్ట్రంలో బీజేపీ కన్నా క్యాడర్‌ బాగున్న తమ పార్టీయే బలమైనదని జనసేన నాయకులు పేర్కొన్నారు. జనసేన తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు శనివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. డాక్టర్‌ పి.హరిప్రసాద్‌, రాందాస్‌ చౌదరి, కిరణ్‌రాయల్‌ మాట్లాడుతూ తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించడం ఆయన వ్యక్తిగతమేనన్నారు. తిరుపతిలో ఎవరు పోటీ చేయాలన్నది బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. 

Updated Date - 2020-12-20T08:43:35+05:30 IST