ఏపీలో ఇళ్ల రగడ...వైసీపీలో ఫైటింగ్..

ABN , First Publish Date - 2020-12-28T20:31:35+05:30 IST

వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ చాలా చోట్ల రసాభాసగా సాగుతోంది.

ఏపీలో ఇళ్ల రగడ...వైసీపీలో ఫైటింగ్..

అమరావతి: వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ చాలా చోట్ల రసాభాసగా సాగుతోంది. ఈ క్రెడిట్ తమదంటే తమదని అధికారపార్టీ నేతలు తన్నుకుంటున్నారు. పంపిణీ కార్యక్రమంలో పెత్తనం కోసం పోటీ పడుతూ రోడ్డెక్కుతున్నారు. వైసీపీ ప్రభుత్వం క్రిస్మస్ రోజు ఆర్భాటంగా ప్రారంభించిన ఇళ్ల పట్టాల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఇళ్ల పట్టాల పంపిణీ వైసీపీలో వర్గ రాజకీయాలకు వేదికగా మారుతోంది. 


గన్నవరం వైసీపీలో మరోసారి రగడ మొదలైంది. ఇళ్లస్థలాల పట్టాల కార్యక్రమంలో యార్లగడ్డ వర్గీయులు, వంశీ వర్గీయుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. వేదికపైనే ఇరువర్గాల కార్యకర్తలు తోసుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. వంశీ వైసీపీలో చేరినప్పటి నుంచి అధికారపార్టీలో పోరు మొదలైంది. అప్పటి వరకు వైసీపీలో పెత్తనం చేసిన నేతలు వంశీ రాకతో అసంతృప్తితో ఉన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చి తమపై ఆధిపత్యం చెలాయిస్తామంటే ఊరుకునేదిలేదని హెచ్చరిస్తున్నా.. వంశీ అనుచరులు తగ్గడంలేదు. ఫ్లెక్సీల ఏర్పాటులో గతంలో రెండు వర్గాలు పోట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు పట్టాల పంపిణీలో ఆ విభేదాలు మరోసారి పొడచూపాయి.

Updated Date - 2020-12-28T20:31:35+05:30 IST