జగన్, విజయసాయి ప్రజలకు క్షమాణ చెప్పాలి: రామకృష్ణ
ABN , First Publish Date - 2020-03-02T20:54:07+05:30 IST
సీఏఏకు మద్దతిచ్చినందుకు సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రజలకు క్షమాణ చెప్పాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే వైసీపీ పార్లమెంట్‌లో సీఏఏకు మద్దతిచ్చి తప్పు చేసిందని దుయ్యబట్టారు.

అమరావతి: సీఏఏకు మద్దతిచ్చినందుకు సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రజలకు క్షమాణ చెప్పాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే వైసీపీ పార్లమెంట్‌లో సీఏఏకు మద్దతిచ్చి తప్పు చేసిందని దుయ్యబట్టారు. సీఎం మెడలు వంచైనా సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయిద్దామని రామకృష్ణ అన్నారు.