జగన్‌ మడమ తిప్పేశారు: కనకమేడల

ABN , First Publish Date - 2020-10-07T22:57:18+05:30 IST

కేసుల నుంచి బయటపడేందుకు సీఎం జగన్‌ మడమ తిప్పేశారని టీడీపీ నేత కనకమేడల రవీంద్ర ఎద్దేవాచేశారు. ప్రత్యేక హోదాను పణంగా పెట్టి.. జగన్‌ సొంత కేసుల కోసం లాబీయింగ్

జగన్‌ మడమ తిప్పేశారు: కనకమేడల

అమరావతి: కేసుల నుంచి బయటపడేందుకు సీఎం జగన్‌ మడమ తిప్పేశారని టీడీపీ నేత కనకమేడల రవీంద్ర ఎద్దేవాచేశారు. ప్రత్యేక హోదాను పణంగా పెట్టి.. జగన్‌ సొంత కేసుల కోసం లాబీయింగ్‌ చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. వ్యక్తిగత ఎజెండాతోనే జగన్‌ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని తప్పుబట్టారు. హోంమంత్రి, ప్రధానితో సమావేశంలో తన భవిష్యత్‌ గురించి మాత్రమే జగన్‌ మాట్లాడుకుంటున్నారని విమర్శించారు. కోర్టు విచారణలు, కేసుల నుంచి బయటపడేందుకు.. ఆయన విశ్వప్రయత్నం చేస్తున్నారని, అందుకే సమావేశ వివరాలను గోప్యంగా ఉంచుతున్నారని కనకమేడల ఆరోపించారు. దమ్ముంటే ప్రధానితో జగన్ ఏం మాట్లాడారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. న్యాయ సలహాదారులతో కలిసి ఢిల్లీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారని, సొంత కేసుల మీదున్న శ్రద్ధ ప్రజాసంక్షేమం మీద లేదా? అని కనకమేడల రవీంద్ర ప్రశ్నించారు.


ఒక్క మంత్రికి కూడా ప్రశ్నించే దమ్ములేదని, మంత్రులు ఇష్టమొచ్చినట్లు బూతులు తిడుతుంటే సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అప్పట్లో ముఖ్యమంత్రిని కాల్చిపారేయండి అని జగన్‌ అనేవారు.. మరి ఇప్పుడు జగన్‌ను ఏం చేయాలని కనకమేడల నిలదీశారు. 

Read more