మళ్లీ ఢిల్లీకి జగన్‌!

ABN , First Publish Date - 2020-10-13T08:15:24+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు.

మళ్లీ ఢిల్లీకి జగన్‌!

రాష్ట్రపతి, ప్రధానితో భేటీకి లేఖ

అపాయింట్‌మెంట్‌ రాగానే ప్రయాణం


అమరావతి, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈసారి ఆయన ప్రధానితోపాటు రాష్ట్రపతి అప్పాయింట్‌మెంట్‌ కూడా కోరారు. అక్కడి నుంచి సమాచారం రాగానే... బహుశా ఒకటి రెండు రోజుల్లోనే జగన్‌ ఢిల్లీకి వెళ్లే అవకాశముందని చెబుతున్నారు. సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జిలపై జగన్‌ ఫిర్యాదు జాతీయ స్థాయిలో వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఆయన మరోమారు రాష్ట్రపతి, ప్రధాని అప్పాయింట్‌మెంట్‌ కోరడంగమనార్హం.

Updated Date - 2020-10-13T08:15:24+05:30 IST