జగన్‌ని మించిన మాయగాడు ఎవరు: బుద్దా

ABN , First Publish Date - 2020-02-08T09:56:08+05:30 IST

‘‘రివర్స్‌ పాలనతో ప్రజలతో పబ్జీ గేమ్‌ ఆడుతున్న జగన్‌ని మించిన మాయగాడు ఎవరుంటారు?

జగన్‌ని మించిన మాయగాడు ఎవరు: బుద్దా

అమరావతి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ‘‘రివర్స్‌ పాలనతో ప్రజలతో పబ్జీ గేమ్‌ ఆడుతున్న జగన్‌ని మించిన మాయగాడు ఎవరుంటారు? తుఫాన్లను ఆపాలన్నా, బంగాళాఖాతాన్ని వెనక్కి జరపాలన్నా, నదుల్ని వెనక్కి పారించాలన్నా, మూడు రాజధానులు కట్టాలన్నా జగన్‌కే చెల్లుతుంది’’ అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన ట్విటర్‌లో స్పందించారు. ‘‘పోలవరానికి పునాది పడలేదు, కమ్మ డీఎస్పీలకు మాత్రమే పదోన్నతులు, అమరావతి అంతా గ్రాఫిక్స్‌ అంటూ రాష్ట్రంలో అసత్యాల తుఫాను సృష్టించిన బ్లాక్‌ మీడియా నడిపే జగన్‌, మీరా నీతులు చెప్పేది విజయసాయిరెడ్డి గారూ?’ అంటూ ధ్వజమెత్తారు. 

Updated Date - 2020-02-08T09:56:08+05:30 IST