కేంద్ర పథకాలకు జగన్‌ స్టిక్కర్లు!: సోము

ABN , First Publish Date - 2020-12-27T07:36:24+05:30 IST

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు, ఇస్తున్న నిధులకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ తన పేరు పెట్టుకుని, తన స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు.

కేంద్ర పథకాలకు జగన్‌ స్టిక్కర్లు!: సోము

నెల్లూరు(స్టోన్‌హౌ్‌సపేట), డిసెంబరు 26: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు, ఇస్తున్న నిధులకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ తన పేరు పెట్టుకుని, తన స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారని, రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని చెప్పారు. నెల్లూరులో శనివారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో వీర్రాజు మాట్లాడారు. వైసీపీ ఎమ్మెల్యేల ఆగడాలు మితిమీరిపోతున్నాయని, బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. 

Updated Date - 2020-12-27T07:36:24+05:30 IST