ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

ABN , First Publish Date - 2020-12-03T19:35:47+05:30 IST

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది.

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వ పిటిషన్‌పై స్టేటస్ కో ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. హైకోర్టు నిర్ణయం ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ లాయర్ అశ్వనీ కుమార్ చెప్పారు.


వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఏపీ స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని తాము అమలు జరపలేమని చెప్పి ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాదితోపాటు ఈసీ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ శుక్రవారం నాటికి వాయిదా వేసింది.

Updated Date - 2020-12-03T19:35:47+05:30 IST