జగన్‌ పాలన అరాచకం: వర్ల రామయ్య

ABN , First Publish Date - 2020-11-15T21:29:37+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత వర్ల రామయ్య ధ్వజమెత్తారు. సీఎం జగన్‌ పాలన అరాచకంగా, పాలెగాళ్ల పాలనలా ఉందనడానికి పల్నాడులో

జగన్‌ పాలన అరాచకం: వర్ల రామయ్య

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత వర్ల రామయ్య ధ్వజమెత్తారు. సీఎం జగన్‌ పాలన అరాచకంగా, పాలెగాళ్ల పాలనలా ఉందనడానికి పల్నాడులో నాయక్ కుటుంబంపై జరిగిన దాడే నిదర్శనమని వర్ల రామయ్య మండిపడ్డారు. సరస్వతీ ఇండస్ట్రీస్‌కి కేటాయించిన భూములను రైతులు సాగుచేసుకుంటుంటే.. వాటిని దున్నడానికి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రౌడీలను పంపాడని తెలిపారు. ఈ దారుణంపై ముఖ్యమంత్రి, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఏం సమాధానం చెబుతారు? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. ఈ ఘటనపై జాతీయ మానవహక్కుల కమిషన్‌కు లేఖ రాస్తామని తెలిపారు. నాయక్ కుటుంబానికి న్యాయం జరిగేవరకు టీడీపీ అండతా ఉంటుందని వర్ల రామయ్య భరోసా ఇచ్చారు.

Updated Date - 2020-11-15T21:29:37+05:30 IST