‘రెండు నెలల రీడింగ్‌ తీయటం వల్ల యూనిట్ల సంఖ్య అమాంతంగా పెరిగింది’

ABN , First Publish Date - 2020-05-10T14:35:37+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ లేఖ రాశారు. కరోనా కష్టాలకు తోడు కరెంట్ కష్టాలు ప్రజలను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయన్నారు.

‘రెండు నెలల రీడింగ్‌ తీయటం వల్ల యూనిట్ల సంఖ్య అమాంతంగా పెరిగింది’

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ లేఖ రాశారు. కరోనా కష్టాలకు తోడు కరెంట్ కష్టాలు ప్రజలను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయన్నారు. విద్యుత్ బిల్లులు 30 రోజులకు మాత్రమే యూనిట్లు విభజించి, రెండు నెలలకు విడివిడిగా బిల్లు తీసి పాత శ్లాబు విధానాన్ని అమలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో కరెంటు చార్జీలు పెంచుతున్నట్లు విద్యుత్‌ సంస్థలు ముందుగా ప్రకటించకుండా అమల్లోకి తేవడం సరికాదన్నారు. కరోనా లాక్‌డౌన్ వల్ల ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రజలపై విద్యుత్ చార్జీలు పిడుగులా పడ్డాయని లేఖలో పేర్కొన్నారు. మే నెలలో 5వ తేదీ నుంచి 15 వరకూ గత రెండు నెలల రీడింగ్‌ తీయటం వల్ల యూనిట్ల సంఖ్య అమాంతంగా పెరిగిపోవడంతో కేటగిరీలు మారి బిల్లులు రెట్టింపు పైగా వచ్చాయన్నారు. 

Updated Date - 2020-05-10T14:35:37+05:30 IST