కరోనా కట్టడిపై జగన్‌ నిర్లక్ష్యం: మావోయిస్టు పార్టీ

ABN , First Publish Date - 2020-03-25T08:45:10+05:30 IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలో జగన్‌ సర్కార్‌ తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని మావోయిస్టు పార్టీ ఏవోబీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శి...

కరోనా కట్టడిపై జగన్‌ నిర్లక్ష్యం: మావోయిస్టు పార్టీ

పాడేరు (విశాఖ జిల్లా), మార్చి 24: రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలో జగన్‌ సర్కార్‌ తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని మావోయిస్టు పార్టీ ఏవోబీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శి గణేశ్‌, ఈస్ట్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి అరుణ వేర్వేరు ప్రకటనల్లో విమర్శించారు. మంగళవారం వారి పేరిట మీడియాకు లేఖలు అందాయి. ‘రోమ్‌ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టు...’ రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుంటే సీఎం జగన్‌ వాటి నివారణకు చర్యలు చేపట్టలేదన్నారు. కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన ఈసీ రమేశ్‌ కుమార్‌ను జగన్‌ ప్రభుత్వం బెదిరించడాన్ని, వేధించడాన్ని మావోయిస్టులు తప్పుబట్టారు.

Read more