మాటలు మార్చేస్తున్న జగన్, నిమ్మగడ్డ రమేశ్

ABN , First Publish Date - 2020-10-27T23:27:06+05:30 IST

అవును మరి ఆయన ఉండగా ఎన్నికలు వద్దన్నాడు ఈయన. అప్పుడేమో ఆయనే కరోనా అని చెబితే ఈయనేమో మత్ డరోనా అన్నారు. ఇప్పుడు ఆయనే నో కరోనా అంటుంటే ...

మాటలు మార్చేస్తున్న జగన్, నిమ్మగడ్డ రమేశ్

అమరావతి: అవును మరి ఆయన ఉండగా ఎన్నికలు వద్దన్నాడు ఈయన. అప్పుడేమో ఆయనే కరోనా అని చెబితే ఈయనేమో మత్ డరోనా అన్నారు. ఇప్పుడు ఆయనే నో కరోనా అంటుంటే అమ్మో కరోనా అంటున్నాడు ఈయన. ఆయన నిమ్మగడ్డ రమేశ్ కుమార్, ఈయన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. అలా మాటలు మార్చేసుకున్నారు. మళ్లీ అధికార యుద్ధానికి దిగారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కోర్టుకు వెళ్లి మరీ పదవి సాధించుకోవడమే కాక, మొన్నటికి మొన్న నిధులు కూడా సాధించుకున్నారు. కరోనా టైమ్‌లోనూ నిమ్మగడ్డను తీసేసి కొత్త వ్యక్తిని హడావుడిగా తెచ్చుకున్నా కోర్టు కాదనడంతో ఇష్టం లేకుండానే భరిస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. కానీ ఆయన ఉండగా స్థానిక ఎన్నికలు జరపకూడదని గట్టిగా పంతం పట్టారు. అయితే కోపంతోనా లేక ఏకగ్రీవాలు పోతాయనే భయంతోనా అనేది వారికి తెలియాలి. 


హైకోర్టు అడిగినప్పుడు మాత్రం కరోనా ఉన్న కారణంగా ఎన్నికలు పెట్టలేమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పేసింది. అయినా సరే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాత్రం ఈ నెల 28న అఖిలపక్షాల సమావేశం పెట్టారు. అన్ని పార్టీల  ప్రతినిధులను రమ్మని ఆహ్మానించారు. దీంతో సర్కార్ ఎన్‌కౌంటర్ మొదలుపెట్టింది. సీఎంవో సెక్రటరీ నుంచి వ్యాట్సప్ మెసేజ్ పెట్టి చర్చలకు రావాలని ఎన్నికల కమిషనర్‌కు కబురు పెట్టారు. హైకోర్టు న్యాయమూర్తి హోదాలో ఉన్న ఎన్నికల కమిషనర్‌ను కావాలనే అలా పిలిచి అవమాన పరిచింది. అంతేకాదు తాము పిలిస్తే రాలేదనే రికార్డును చేసి తర్వాత కోర్టులో అందించే ప్రాసెస్‌లో కూడా ఇది భాగమే అంటున్నారు. 


Updated Date - 2020-10-27T23:27:06+05:30 IST